Surprise Me!

TOP 10 NEWS Today టుడే టాప్ 10 న్యూస్ | Oneindia Telugu

2017-10-25 20 Dailymotion

1. ప్రముఖ మహిళా బైక్‌ రైడర్‌ సనా ఇక్బాల్‌(32) మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. భర్త అబ్దుల్‌ నదీంతో కలిసి ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ దుర్ఘటన జరిగింది. అయితే, ఈ ప్రమాదం అనుమానాస్పాదంగా ఉందని సనాను ఆమె భర్తే హత్య చేశాడంటూ ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు <br />2. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన గౌతమ్ రెడ్డి అనుచరుడికి వైసిపి పెద్దలు ఓ పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై వంగవీటి రాధాకృష్ణ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. తన తండ్రిని విమర్శించిన నాయకుడి అనుచరుడికి పదవి కట్టబెట్టడంపై ఆయన గుర్రుగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి <br />౩. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగే అవకాశముందని అంచనా ! <br />4. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు కార్యాలయాన్ని ప్రారంభించారు. తొలుత భరతమాతకు పూజలు చేశారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేసారు. <br />5. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డికి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లలో మరో షాక్. నాలుగు రోజుల క్రితం కొందరు నేతలు అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా, మంగళవారం మరికొందరు టిడిపి నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు

Buy Now on CodeCanyon